నివర్ తుఫాన్ భాదితులకు అండగా నిలిచిన బీజేపీ నేత పసుపులేటి సుధాకర్
అల్లూరు, డిసెంబర్ 2,(న్యూస్ మేట్): నివర్ తుపాన్ కారణంగా లోతట్టు పాంత్రాలలో నివాసం ఉంటూ తిండికి సైతం ఇక్కట్లు పడుతున్న వారకి బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అంద జేస్తున్నారని అల్లూరు మండల బీజేపీ అధ్యక్షులు కన్యాపురి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని చాకిరేవుగుంట గిరిజన కాలనీలో అల్లూరు భారతీయ జనతా పార్టీ శాఖ ఆద్వర్యంలో బోజనానికి కావాలసిన అన్ని ఎర్పాట్లు చేసి స్థానికులకు పంపిణీచేశారు. ఈసందర్భంగా పసుపులేటి సుధాకర్ చేస్తున్న సేవలను బాధితులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ పధాదికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు