ఈనెల 7 న ఛలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి జిల్లా సిపిఐ కార్యదర్శి

ఈనెల 7 న ఛలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి జిల్లా సిపిఐ కార్యదర్శి

02/12/20
ఒంగోలు డిసెంబర్ 2 న్యూస్ మెట్ : డిసెంబర్ 7 న చలో కలెక్టరేట్ కార్యక్రమం పోస్టర్ ను సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విడుదల చేశారు. జిల్లా లో అర్హులైన పేదలకు నివేశిత స్ధలాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7 న సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. స్ధానిక మల్లయ్యలింగం భవన్ లో బుధవారం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పేదలకు నివేసిత స్ధలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 25 న పేదలకు నివేసిత స్ధలాలను ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించటాన్ని సీపీఐ గా ఆహ్వానిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇవ్వాల్సి వుండగా కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు.అలాగే కోర్టు వివాదాలలో ఉన్న భూములలో ఇళ్ళస్ధలాలలో పట్టాలు ఎలా పంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో గృహాల కాంట్రాక్టర్లు తో సమావేశం వేయకుండా, నూరుశాతం పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలికుండా ,మౌళిక వసతులు పూర్తి స్థాయిలో ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పకుండా ప్రకటన చేయటం వాస్తవ పరిస్థితి కి విరుద్ధంగా వుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు ,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వంతున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంఎల్ సీ పిజె చంద్రశేఖర్ ముఖ్య అతిధులు గా హాజరవుతారన్నారు.కార్యక్రమంలో సీపీఐ ఒంగోలు నగర కార్యదర్శి ఎస్ డి సర్ధార్, సహాయ కార్యదర్శి బి చంద్రశేఖర్, ఎస్ కె మస్తాన్, డిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *