మైనింగ్ భూముల్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేనికి తెలియదా? యరజర్ల లో మైనింగ్ భూమిని చదును చేయడం లో మీరు చేసింది అవినీతి కాదా? ఇళ్ల పట్టాల పేరుతో పేద ప్రజలను మోసం చేయడం మీకు తగునా? దేశం నేత డాక్టర్ నూకసాని బాలాజీ

మైనింగ్ భూముల్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేనికి తెలియదా?
యరజర్ల లో మైనింగ్ భూమిని చదును చేయడం లో మీరు చేసింది అవినీతి కాదా?
ఇళ్ల పట్టాల పేరుతో పేద ప్రజలను మోసం చేయడం మీకు తగునా? దేశం నేత డాక్టర్ నూకసాని బాలాజీ

02/12/20

ఒంగోలు డిసెంబర్ 2 న్యూస్ మేట్ : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యర్రజర్ల గ్రామం లో ట్రిపుల్ ఐటీ కళాశాల పెట్టాలి అనుకుని ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రదేశం మైనింగ్ భూముల్లో ఉన్న కారణంగా అక్కడ కళాశాల పెట్టడానికి వీలు కాదని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మీదట ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఆ విషయం నాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా ఇప్పుడు అధికార పక్షం లో ఉన్నటువంటి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కి కూడా తెలుసు అనే అని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం 2013 మే 2వ తేదీన ఒక మెమో నేం :14433/Assn.I(1)/2013-1 ప్రకారం ఖనిజ వనరులు లేదా ఖనిజసంపద ఉంటే సదరు భూమిని ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదని ఉంది. ఒకవేళ ఇచ్చినా వాటిని మైనింగ్ కు కేటాయించాలని జి. ఓ.ఎం.ఎస్ నెం o74,dt.16.02.2002 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆ భూముల్ని గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ కళాశాల పెట్టడానికి వీలులేదని తగ్గినప్పుడు, ఆ విషయం తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అదే భూము ల్లో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు? ఆ భూములు కోర్టులో ఉన్నప్పుడు, ఆ భూములు చదును చేయడానికి కి 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం ఎందుకు? మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని జీవోలు ఉన్నప్పటికీ, అక్కడి పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు కచ్చితంగా ఇస్తా అని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఇది తెలిసి కూడా మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని స్పష్టంగా ఉంటే మరి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా తప్పుదారి పట్టించినట్లు అవుతుంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినా కానీ అవి మైనింగ్ భూములు కాదని ఎన్.ఓ.సి లు ఇచ్చి ఇవ్వాలని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయడం వేలు వంక పెడితేనే వెన్న రాదు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని తెలిసి కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోంది అని, దానిని దామచర్ల జనార్దన్ రావు మీద నెట్టడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. మీరు పేద ప్రజలకు నిజంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే, స్థలాలు ఇవ్వాలనుకుంటే ఇప్పటికే నిర్మించి ఉన్న 1500 టిడ్కో గృహాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నిచారు. కాబట్టి మీరు ప్రజలను మోసగించి ఆపేసి ఆ మైనింగ్ స్థానాల్లో భూములు ఇవ్వాలి ప్రతి పేద ప్రజలకు మీరు అనుకుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎన్వోసీ తీసుకుని రండి, ప్రభుత్వం నుండి ఒక స్పష్టత తీసుకోండి, పేద ప్రజలకు మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ కచ్చితంగా స్వాగతిస్తుంది అని నూకసాని బాలాజీ గారు అన్నారు. బహుశా మైనింగ్ భూములు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకూడదనే విషయం బహుశా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు అని మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డికి తెలియకపోవడం కూడా మరి విడ్డూరంగా ఉందని అన్నారు. యర్రజర్ల భూమికి సంబంధించిన విషయాన్ని రెండు నిమిషాల్లో ముగించాల్సిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకపోవడంతో దాదాపు అరగంట పైగా మాట్లాడటం మరి హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ యర్రజర్ల ఇళ్ల పట్టాల ఇచ్చి తీరుతామని ప్రకటించడం ఎలా సాధ్యమని, మరిది బాలినేని గారికి అవగాహన లేదా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన అనుచరులకు తన జేబులో వేసుకోడానికి 40 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి భూమిని చదును చేయించారని అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసులు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు
నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు పి.వేంకటేశ్వర రెడ్డి, షేక్ కాలేషా బేగ్, తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీమ్, పూసపాటి జాలిరెడ్డి, మన్నేపల్లి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *