7న చలో కలెక్టరేట్ కార్యక్రమాలు జయప్రదం చేయండి సిపిఐ

7న చలో కలెక్టరేట్ కార్యక్రమాలు జయప్రదం చేయండి సిపిఐ

02/12/20
కందుకూరు డిసెంబర్ 2 న్యూస్ మేట్ : గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని అదేవిధంగా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో చలో కలెక్టరేట్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల నుండి పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా అందని ద్రాక్ష పండులా ఆశ పడుతూ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ సమయం లో నిర్మించిన జి ప్లస్ త్రీ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి ఆలోచించాలని ఆయన కోరారు. పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని జి ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు స్వాదీనం చేయాలని కోరుతూ ఈ నెల 7న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి బూసి సురేష్ బాబు సిపిఐ నాయకులు పి బాలకోటయ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ ఏఐటీయూసీ నాయకులు షేక్ హుస్సేన్ ఏఐవైఎప్ నియోజకవర్గ అధ్యక్షుడు హరిబాబు ఏం సుభాను తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *