రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తాం రైతు సంఘం నేత వీరారెడ్డి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తాం రైతు సంఘం నేత వీరారెడ్డి

02/12/20
కందుకూరు డిసెంబర్ 2 న్యూస్ మేట్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులను , విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు కె వీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత వారం రోజులుగా రైతులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకి మద్దతుగా నిరసన జరుగుతుందని వీరారెడ్డి అన్నారు. ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాలు సైతం మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మొండిగా రైతుల మీద కేంద్ర ప్రభుత్వం రుద్దటానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రైతు సంఘాల మధ్య చీలికలు తెచ్చేందుకు కొన్ని రైతు సంఘాలను మాత్రమే చర్చలకు పిలిచి అవమానించిన ప్పటికీ రైతులందరూ ఐక్యంగా ఈ మూడు చట్టాలను రద్దు చేసే వరకూ మా ఆందోళన విరమించబోమని మంత్రికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకోక పోగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మూడు వ్యవసాయ చట్టాలతో పాటు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు ఐక్యంగా పోరాడుతామని అన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు జి చెంచురామయ్య రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మాధవరావు రైతు సంఘం నాయకులు ఎం లక్ష్మీనారాయణ, మాధవరావు, భీమ్ ఆర్మీ నాయకులు కే మాల్యాద్రి, ఎస్సీ సెల్ నాయకులు కే యానాది, అశోక్, కొండయ్య పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *