చలో కలెక్టరేట్ కార్యక్రమంను జయప్రదం చేయండి

చలో కలెక్టరేట్ కార్యక్రమంను జయప్రదం చేయండి

యర్రగొండపాలెం డిసెంబర్ 2 న్యూస్ మేట్ : డిసెంబర్ 7వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పేదలు, లబ్ధిదారులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ సీనియర్ నాయకులు టిసిహెచ్ చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో చలో కలెక్టరేట్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ టిట్కో ఇళ్ళను వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పేదల ఇల్లు నివాసయోగ్యంగా ఉండాలంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణగౌడ్, త్రిపురాంతకం మండలం కార్యదర్శి బాణాల రామయ్య, యర్రగొండపాలెం మండల కార్యదర్శి కే.గురవయ్య, సీపీఐ నాయకులు నాగేశ్వరరావు, బాదరయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *