ఆస్తి ఆధారిత పన్నుల పెంపు నిరసిస్తూ సిపిఎం ఆందోళన
కందుకూరు డిసెంబర్ 2 న్యూస్ మేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులపై పెంచిన పన్నులను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ కి బుధవారం వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు మువ్వా కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా ఆస్తులపై పన్నులు పెంచుతుందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుంటే ప్రభుత్వం ఆస్తులపై పన్నులు విధించడం సమంజసం కాదని ఆయన అన్నారు .ఆస్తి ఆధారిత బిల్లు వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ ఏ గౌస్ మున్వర్ సుల్తాన్ మానోజ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.