తోట సుబ్బయ్య జ్ఞాపకార్థం చిల్డ్రన్ హోమ్ లో సరుకులు వితరణ

తోట సుబ్బయ్య జ్ఞాపకార్థం చిల్డ్రన్ హోమ్ లో సరుకులు వితరణ
కనిగిరి డిసెంబర్ 3 (న్యూస్ మేట్) : 03/12/20రిటైర్డ్ టీచర్ తోట సుబ్బయ్య 25 వ వర్ధంతి సందర్భంగా గా వారి కుటుంబ సభ్యులు తోట రవీంద్రనాథ్, తోట వెంకటరమణ సహాయార్థం తమ మిత్ర బృందం ద్వారా స్థానిక కనిగిరి చిల్డ్రన్స్ హోమ్ లో గురువారం సరుకుల వితరణ చేశారు. చిల్డ్రన్స్ హోమ్ నిర్వహణకు అవసరమైన కందిపప్పు నూనె చింతపండు ఉల్లిపాయలు బొంబాయి రవ్వ వంటి నిత్యావసర సరుకులు నిర్వాహకులు అత్తులూరి జాన్సు కవితలకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మా తండ్రి సుబ్బయ్య జ్ఞాపకార్ధంగా చిన్నారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఇలాంటి చిల్డ్రన్స్ హోమ్ కు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. అనంతరం దాతలను, వారి మిత్రబృందం ని హోమ్ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రమేష్, మస్తాన్ వలీ, సుబ్రహ్మణ్యం, కేశవ , ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *