టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ మరియు కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయడానికి అవకాశం లేదా? మహానుభావుడికి ఇచ్చే గౌరవం ఇదేనా ?యూనివర్సిటీ పేర్నమిట్ట స్ధలంలో నిర్మాణం జరగడానికి అవకాశం లేదా . ప్రకాశం పంతులు పేరు మీద యూనివర్సిటీ పేరుకు మాత్రమే నా ? నిర్మాణం జరగదు అని ప్రచారం జరుగుతోంది అది నిజమేనా ?

టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ మరియు కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయడానికి అవకాశం లేదా? మహానుభావుడికి ఇచ్చే గౌరవం ఇదేనా ?యూనివర్సిటీ పేర్నమిట్ట స్ధలంలో నిర్మాణం జరగడానికి అవకాశం లేదా . ప్రకాశం పంతులు పేరు మీద యూనివర్సిటీ పేరుకు మాత్రమే నా ? నిర్మాణం జరగదు అని ప్రచారం జరుగుతోంది అది నిజమేనా ?

03/12/20
ఒంగోలు డిసెంబర్ 3 న్యూస్ మేట్ :యూనివర్సిటీ భూముల్లో క్రీడా ప్రాంగణం ,శిల్పారావం సైన్స్ సెంటర్ , ప్లానిటోరియం కి భూములు కేటాయించారు. ఇవి కాక ఇతర సంస్థలకు భూములు కేటాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానిని జిల్లా కలెక్టర్ మరియు యూనివర్సిటీ కులపతి అయిన పోలా భాస్కర్ ప్రచారం జరుగుతోన్న దానిని ఎంత నిజమో కాదో స్పందించి యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరగబోతుంది వెంటనే స్పందించి విద్యార్థులకు ,తల్లిదండ్రులకు జిల్లా ప్రజలకు మీద్వార వారికి భరోసా కల్పించాలి. 120 ఎకరాల యూనివర్సిటీ భూమి లోకి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేకపోవడం ఇన్ని సంవత్సరాలుగా పక్కా రోడ్డు నిర్మాణం లేకపోవడం చాల చాల భాధ పడవలసిన విషయం గతంలో త్వరలో నిర్మాణం పనులు జరుగుతుంది అన్నారు . ఎక్కడ ఆనవాలు కనబడటం లేదు. గతంలో జిల్లా కలెక్టర్ అన్ని వైపుల భూమిని చదును చేయమని అధికారులకు ఆదేశించారు ఎక్కడ పరిశుభ్రంగా చేసినట్టు కనబడటం లేదు చూసిన వారికి . ఇక్కడ గతంలో కోటి రూపాయల తో నిర్మాణం చేసిన బిల్డింగ్ ఉపయోగం లేకుండ పోయింది . క్రీడా ప్రాంగణం, శిల్పారావం మరియు సైన్స్ సెంటర్ మరియు ప్లానిటోరియం విద్యార్థులకు మరియు ప్రకాశం జిల్లా ప్రజలకు ఈ మూడు సంస్థలు ఎంతగానో ఉపయోగపడుతాయి.ఈమధ్య కాలంలో మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లా శ్రీ హరి కోట నుంచి ఎస్ ఎల్ II ప్రయోగించి విజయవంతం గా ప్రయోగించారు. అందులో ఒక లేడీ సైంటిస్టు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీమతి టెసీ థామస్ మిసెల్స్ మొదటి బారత దేశంలో లేడి సైంటిస్ట్ ఈమె ఆమె పాత్ర అమోఘం తల్లి తండ్రులు విద్యా సంస్ధల యాజమాన్యం , సైన్స్ సంఘాలు ,విద్యార్థుల సంఘాలు ,ఉపాద్యాయ ,అధ్యాపకుల సంఘాలు మీరు అందరూ ఆలోచన చెయ్యలేరా ప్రకాశం జిల్లా లో ఇలాంటి సైంటిస్టులు గా , మేధావులు గా వారిని తీర్చిదిద్దే ఆలోచన చెయ్యలేరా . ప్రకాశం జిల్లాలో సైన్స్ సెంటర్ మరియు ప్లానిటోరియం ఏర్పాటు చేయాలని గత 15 సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం .గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 20 కోట్లు కేటాయించారు . ఒంగోలు నగరంలో సైన్స్ సెంటర్ మరియు మ్యూజియం కి శంకుస్థాపన చేశారు. మన జిల్లా మాజీమంత్రి శిద్దా రాఘవరావు జిల్లా ప్రజలు చాల సంతోషం వ్యక్తం చేశారు. కానీ మూడునాళ్ళ ముచ్చటగా అయింది. కారణం ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగింది .అప్పుడు అనిపించింది నిజంగానే ఈ జిల్లా వెనుక పడిన ప్రాంతం గా ఎందుకు అంటారు అంటే ఇదే ఉదాహరణ .కొత్త ప్రభుత్వం వచ్చి షుమారు సంవత్సరం ఏడు నెలలు గడుస్తున్నా మన జిల్లా లో విద్యార్థులు ,యువతీ యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చిన్నప్పటి నుంచి మంచి మేధావులు గా సైంటిస్టులు ,ఇంజనీర్ ,డాక్టర్ లుగా , ప్రొఫెసర్ గా ,సంగీత విద్వాంసులు ,గాయకులు మరియు వాయిద్య కళాకారులు తదితర తన కెరియర్ ఎంచుకోవడానికి అలాగే దేశానికి ,రాష్ట్రానికి సేవలు అందించేందుకు ఉపయాగ పడవలసిన ఇలాంటి సైన్స్ సెంటర్స్ మరియు ఫ్లానిటోరియం లాంటివి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ , సంగీత కళాశాల విజయనగరం తరహా లాంటి సంస్థలు వస్తే జిల్లా అభివృద్ధి చెందడానికి మంచి మంచి మేధావులు గా అవడానికి మన జిల్లా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతారు . కొత్త ప్రభుత్వం లో మన జిల్లా కి ఇద్దరూ మంత్రుల కు చోటు కలిపించారు వీరి శాఖలు కూడ వీరిద్దరి కి అనుబంధం గా ఉండే సంస్ధలు ఎందుకంటే ఇద్దరూ కూడ షూమారు నాలుగు సార్లు శాసన సభ్యులు గా ఎన్నిక అయిన వారు వారికి ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం గా ఉంది మన జిల్లాలో ఒకటి కూడ అత్యంత మైన విద్యా సంస్ధ లేదు అనేది వీరిద్దరి కి తెలుసు. అలాగే ప్రకాశం జిల్లాలో నివాసం ఉంటున్న వారి అందరికీ తెలుసు కానీ గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒక్క విద్యాసంస్ధ కూడ రాలేదు .పెర్నమిట్ట లో ఈ విద్యా సంవత్సరం అయినా శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ప్రకటన వస్తుంది అనుకున్నారు ప్రకాశం జిల్లా ప్రజల కి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది ఇద్దరూ మంత్రులు ప్రకాశం జిల్లా బాగ వెనుకబడిన ప్రాంతంగా ఉంది దీనిని అధికమించి ముందుకు తీసుకొని వెళ్తాం అన్నారు . గతంలో సైన్స్ సెంటర్ మరియు మ్యూజియం కోసం 20 కోట్లు రూపాయలు మంజూరు అయ్యింది . సంగీత కళాశాల కూడ మంజూరు చేయ్యడానికి టూరిజం శాఖ కూడ రెడీ గా ఉంది , టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ ప్రకటించారు . మొదట హాస్టల్స్ కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశా రు .మొదటి విడత గా 2 కోట్ల రూపాయలు విడుదల చేశారు . వర్క్ ఆర్డర్ ఈ రెండిటికి కూడ ఇచ్చారు. కానీ ఎన్నికలు సందర్భంగా కోడ్ వలన ఆగిపోయింది . అబ్బాయిలు 50 ,అమ్మాయి 25 మందికి హాస్టల్స్ లో ఉండడానికి అవకాశం కల్పించారు . కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడ ముందుకు వెళ్ళలేదు . యూనివర్సిటీ కోసం ఇన్ చార్జ్ ఉపకులపతి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ని నియమించారు .పేర్నమిట్ట లో యూనివర్సిటీ కోసం 110 ఎకరాలు కొనుగోలు చేసి ఎకరం 22 లక్షలు . ముందుగా ఎకరం 11 లక్షల రూపాయలు చెల్లించారు .తరువాత చిన్న సమస్య వలన కోర్టు కేసు వలన పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. అందులో ఒక్క బిల్డింగ్ నిర్మాణం చేశారు . అక్కడకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటి లేదా రెండు ఫ్యాకలిటి లు అయినా తరలిస్తే బాగుంటుంది. విద్యార్థులు లకు ,తల్లి తండ్రులు లకు నమ్మకం ఏర్పడుతుంది . కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి యూనివర్సిటీ తరలించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. చాల మంది విద్యార్థులు తల్లి తండ్రులు . ప్రకాశం జిల్లా నుంచి 400 మంది విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ లో చదువు తున్నారు . చాల ఖర్చు పెట్టి తల్లి తండ్రులు పిల్లల ను చదివిస్తున్నారు . అదే పెర్నమిట్ట స్ధలంలో తరగతులు ,హాస్టల్స్ , క్రీడా మైదానం మరియు సైన్స్ సెంటర్ మరియు ప్లానిటోరియం , సంగీత కళాశాల ఈ రెండు మూడు నిర్మాణాలు చెయ్యకలిగితే ప్రకాశం జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు ,తల్లి తండ్రులు లకు ఖర్చులు బాగ తగ్గుతుంది . సైంటిస్టులు , గ్రాడ్యుయేట్ లు , మంచి క్రీడా కారులు రావడానికి అవకాశం కలిపించిన వారు అవుతారు . దీని వలన చాలామంది కి కొత్త ఉద్యోగాలు , ఉన్నవారికి ప్రమోషన్ లు కూడ వస్తాయి . కేంద్రం నుంచి భారీగా నిధులు రావడానికి అవకాశం ఉంది . కేరళ లో చదువు కున్న వారు ఎక్కువ సైంటిస్టులు కూడ ఎక్కువగా ఉండడానికి కారణం ఇలాంటి సమస్ధలు ఉండటం కారణం అందులో ఒక్క మహిళా సైంటిస్ట్ గా ఎదగడానికి కారణం భారత దేశంలో మొదటి మిస్సైల్ మహిళ గా ఎదగడం కారణం అయింది . ఇద్దరు మంత్రులు యువ మంత్రులు గా ఉన్నారు పేరు కి ఒక్కరు విద్యాశాఖ ఇంకో మంత్రి అటవీశాఖ , సైన్సు & టెక్నాలజీ ఈరెండు మూడు కూడ వారి పరిధిలో ఉన్నాయి . కానీ ప్రకాశం జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి వెంటనే ఈ రెండు ,మూడు సమస్ధలు మీద దృష్టి పెట్టాలని మంచి కబురు కోసం విద్యార్థులు ,తల్లి తండ్రులు ఎదురుచూస్తున్నారు.జిల్లా కలెక్టర్ శ్రీ .పోలా భాస్కర్ కూడ జిల్లా ఉన్నతాధికారిగా ఇద్దరు మంత్రులు దృష్టికి తీసుకొని రాగలరు .వెంటనే ప్రారంభించగలిగితే మంచి పేరు వస్తుంది జిల్లా కి రెండు ,మూడు మంచి సమస్ధలు వచ్చినట్లు ఉంటుంది.ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .ఈ సమావేశంలో అయినా నిధులు విడుదల చేయాలని కొత్త వాటికి ఆమోదించే విధంగా చూడాలని అప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు కి నిజమైన నివాళులు అర్పించినట్లు . అవుతుంది.

కొల్లా మధు ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *