అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న మాకు ఖర్చు నిమిత్తం దానం చేయండి- దివ్యాంగులు
59వ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సాక్షిగా భిక్షాటన చేసిన వికలాంగులు
కావలి డిసెంబర్ 3,(న్యూస్ మేట్): వికలాంగుల దినోత్సవం సందర్భంగా జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ముసునూరు వికలాంగుల కాలనీలో ఈరోజు అధికార పార్టీ నేతల ఒత్తిల్లకు లొంగిన అధికారులు వికలాంగులను కోర్టు పాలు చేశారని కోర్టుల ఖర్చులు చాలా పెట్టినాము అయినా చాలక ఇంకా పెట్టుకోవాలి వికలాంగులకు ఇచ్చిన స్థలాలను కట్టుకున్న ఇళ్లను కాపాడుకోవాలంటే న్యాయస్థానం, ప్రజలు, పత్రిక, మీడియా మమ్ములను కాపాడాలి (ఇంతకుముందు అదికారులు మాకు సహాయం చేసేవారు ఇప్పుడు అధికారులు మీరు కోర్టు, కలెక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్లారు అనుభవించండి అని సకలాంగులను సుమారు 30 మందిని, కొత్త వికలాంగులను తీసుకొచ్చి మమ్ములను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు) అందుకు కోర్టు ఖర్చులకు గాను మేము ప్రజలను నేతలను కలసి వేడుకుంటున్నాము. కనుక మాకు దానం చేయండి మాకు కోర్టు ఖర్చులకు సహాయం చేయండి బాబు అంటూ భిక్షాటన చేసారు.