ఢిల్లీలో రైతుల నిరసన కు మద్దతుగా సిఐటియు మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
పామూరు డిసెంబర్ 3 ( న్యూస్ మేట్) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పై కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని సయ్యద్ హనీఫ్ అన్నారు.దేశ రైతులకు ఉరితాడు గా మారే చీకటి చట్టాలను వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలని కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ చారిత్రాత్మక పోరాటానికి మద్దతుగా పామూరు లో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం సి ఐ టి యు, రైతు సంఘం ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నుండి కందుకూరు రోడ్డు మీదుగా ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారి 565 పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్. హనీఫ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పి బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని గత వారం రోజుల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పై మోడీ ప్రభుత్వం కేంద్ర బలగాలను ఉపయోగించుకుని భాష్పవాయువు గోళాలను ప్రయోగించి లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కు అప్పజెప్పడానికి ఈ చట్టాలను చేసిందన్నారు. రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్న సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న వారిని ఎస్ఐ.అంబటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.