వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపిన సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్ ),ముస్లిం మైనార్టీ, నాయకులు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపిన సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్ ),ముస్లిం మైనార్టీ, నాయకులు
కావలి, డిసెంబర్ 3,(న్యూస్ మేట్) : 03/12/20దేశానికే నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని గత 8రోజులుగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనకు కావలి లో వామపక్ష, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నిరసన తెలియచేసారు.సీపీఐ నాయకులు డి.సత్యం మాట్లాడుతూ….కార్పొరేట్ ల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తెచ్చారని అన్నారు. ఇది రైతులకు ఎంత మాత్రం ఉపయోగం లేనివి అని అన్నారు. రైతులు ఈ చట్టం వద్దని ఆందోళన చేస్తుంటే కేంద్రం మాత్రం మొండిగా ఉందని అన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. సి.పి.ఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.భాస్కర్ మాట్లాడుతూ..వ్యవసాయ చట్టాల రద్దు కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై నిర్బంధాన్ని ప్రయోగించడం అమానుషం అని అన్నారు. ఒక వైపు జై కిసాన్ జై జవాన్ అంటూ మరో వైపు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని అన్నారు. అన్నదాతల పై క్రూరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు, వేలాది ట్రాక్టర్లు, లక్షలాది రైతులు దేశ రాజధానిలో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నారని వారికి ముస్లింలు, దళితులు అండగా ఉన్నారని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర హక్కు అని దాన్ని కాలరాయడం అన్యాయం.సి.పి.ఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ..కార్పొరేట్ లకు ఊడిగం చేస్తున్న మోడీ రైతులను దగా చేస్తున్నారని అన్నారు. వ్యవసాయా రంగాన్ని నాశనం చేసే విధానానాలను కేంద్రం అమలు చేస్తుందని అన్నారు. నూతన వ్యవసాయ చట్టం దేశ ప్రజలను మరింతగా దోపిడీ చేస్తుందని అన్నారు. ఢిల్లీలో రైతులతో ఒక వైపు చర్చలు చేస్తూనే మరో వైపు వాటర్ క్యాన్లు, భాష్పవాయు గోళాలు, లాఠీ దెబ్బలు ప్రయోగిస్తున్నారని అన్నారు. తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఇవి రద్దు అయ్యేంతవరకు రైతులు పోరాటం ఉంటుందని దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. మైనార్టీ నాయకులు సయ్యద్ జిలానీ మాట్లాడుతూ వ్యవసాయ రంగ కార్పొరేట్ కు దాసోహమైన మోడీ రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ నల్ల చట్టాలు భారత దేశ ప్రజలకు ఉరి తాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో Y.కృష్ణ మోహన్, జమీర్, సిరాజ్, రఫీ, జిలానీ, రసూల్, మస్తాన్, మాలకొండయ్య, షాన్వాజ్, తదితరులు ఉన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *