బ్రహ్మ రెడ్డి కటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.
వలేటివారిపాలెం డిసెంబర్ 3 న్యూస్ మేట్: అనారోగ్య కారణంగా సోమవారం మృతి చెందిన మాజీ ఎంపిటిసి బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరామర్శించారు. గురువారం పోలినేనిచెరువు గ్రామంలోని యాళ్ల బ్రహ్మారెడ్డి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు అత్యంత ఆప్తుడు బ్రహ్మారెడ్డి అని ఆయన లేకపోవడం నాకు ఎంతో లోటు అని అన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పనుల మంజూరు చేయాలని నాపై ఒత్తిడి చేసే వారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. మీరు అధైర్య పడకుండా గుండె నిబ్బరంతో ఉండాలని అన్నారు. ఆయన వెంట వైసిపి నాయకులు అనుమోలు లక్ష్మీనరసింహం, వెంకటేశ్వర్లు, వీరాస్వామి, కట్టా హనుమంతరావు,గుత్తా గోపి, సంజీవరెడ్డి, వేణుగోపాలరెడ్డి,గొర్రెపాటి సురేష్, ఇరపని సతీష్,అంజయ్య, గురజాల కృష్ణయ్య, ఓబుల కొండయ్య, తిరుపతి రెడ్డి, ఇంటూరి హరిబాబు, కేసం రెడ్డి నరేంద్ర రెడ్డి, కుంభాల క్రాంతి, సుధాకర్, మర్రి అంజయ్య, పొట్టేళ్ల అంజయ్య,పెయ్యల మల్లికార్జున,యానాది, తదితరులు పరామర్శించారు