ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
కావలి, డిసెంబర్ 3 ,(న్యూస్ మెట్) : కావలి తుఫాన్ నగర్ లో వివాహిత మహిళ వినుకొండ జ్యోతిక (30సం) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది .కావలి రెండవ పట్టణ సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ అరుణకుమారి లు తెలిపిన వివరాల మేరకు 13 సంవత్సరాల క్రితం జ్యోతి కు రవి తో వివాహమైనదని తెలిపారు. భర్త రవి ఉదయం 6 గంటలకు బార్బర్ షాప్ తెరవడానికి వెళ్లాడని, జ్యోతిక 7 గంటల సమయంలో ఇంటి ముందు కూడా ముగ్గులు వేసిందని స్థానికులు తెలిపారన్నారు. పిల్లలు ఉదయం ఎనిమిది గంటల సమయంలో నిద్రలేచి తల్లి కోసం వెతకగా ఇంట్లో బయట వితికే సమయంలో ఆమె ఇంట్లో బాత్రూంలో తల్లి ఉరివేసుకుని ఉన్న దృశ్యాన్ని పిల్లలు చూసి పెద్దగా కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి భర్తకి, మహిళ తల్లిదండ్రులకు మరియూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. యేలబడి ఉన్న స్థితిలో వారు వచ్చి తాడు ను కట్ చేసి తీశారని తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని తిలిపారు.