ఇనిమెర్లలో పంటనష్ట వివరాలను నమోదుచేస్తున్న ఏవో , వీఆర్వో.
పామూరు డిసెంబర్ 3 (న్యూస్ మెట్) : పామూరు మండలంలోని ఇనిమెర్ల నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబందించి పంటనష్ట నమోదు కార్యక్రమం నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మండల వ్యవసాయాధికారి తాతపూడి అబ్రహంలింకన్ తెలిపారు. ఈసందర్భంగా గురువారం మండలంలోని ఇనిమెర్ల గ్రామంలో దెబ్బతిన్న మినుము పంట నమోదు వివరాలను స్థానిక వీఆర్ వో. రామాంజనేయులుతో కలిసి క్షేత్రస్తాయిలో పరిశీలించి నష్ట వివరాలను నమోదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 38 శాతం పైగా దెబ్బతిన్న పంటను మాత్రమే నష్టంగా పరిగణించి వివరాలను నమోదుచేస్తున్నట్లు తెలిపారు. మినుము పంట ఎక్కువగా నీరు నిలబడి ఉండటంతో విత్తనాలు మొలకెత్తి నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. పంటలను సాగుచేసిన రైతులు విధిగా వారి వారి పంటలను పంటనష్టం నమోదుచేసే బృందాలకు చూపించి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు . కార్యక్రమంలో వీఏఏ సుబ్బారావు , రైతులు పాల్గొన్నారు .