పిల్లలకు దుప్పట్లు చాపలు పంపిణీ చేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు

పిల్లలకు దుప్పట్లు చాపలు పంపిణీ చేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు

03/12/20
పామూరు డిసెంబర్ 3 (న్యూస్ మేట్) : ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చూపించి సాధారణ పిల్లలతో సమానంగా విద్యాబోధన చేసి వారిలో ఆత్మ ఫైర్యాన్ని పెంపొందించాలని ఎంఈఓ దాసు ప్రసాదు పేర్కొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక భవిత భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలకు వారిలో లోపాన్ని తెలియనివ్వకుండా ప్రతి ఒక్కరూ వారిపట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. కృషి , పట్టుదల ఉంటే వికలాంగులు సైతం ఉన్నత శిఖరాలను అధికమించవచ్చని పలువురు నిరూపించారన్నారు. ప్రభుత్వం వికలాంగులను అన్ని విధానా ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని దానిని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు ఆరోగ్య సూత్రాలు పాటించి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వికలాంగులు జన్మించకుండా కొంతమేర నివారించవచ్చన్నారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్స్ ప్రతినిదులు నారాయణ 40 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు స్నేహభావంతో మెలగాలన్నారు. కృషి , పట్టుదల ఉంటే వికలాంగులుసైతం శిఖరాలను అధికమించవచ్చని పలువురు నిరూపించారన్నారు. ప్రభుత్వం వికలాంగులను అన్ని విధానా ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని దానిని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు ఆరోగ్య సూత్రాలు పాటించి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వికలాంగులు జన్మించకుండా కొంతమేర నివారించవచ్చన్నారు వానవీక్లబ్స్ ప్రతినిదులు నారాయణ 40 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు దుప్పట్లు , చాపలు సమకూర్చి వాటిని ఎంఈవో చేతులమీదుగా పిల్లలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఈఆర్టీలు రాజారెడ్డి , యంఐఎస్ కోర్డినేటర్ యం.విజయ బాస్కర్ రెడ్డి , సీఆర్ ఏలియా , ప్రత్యేక అవసరాలుగల పిల్లలు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *