పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని అధికారులకు సూచించిన మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు

పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని అధికారులకు సూచించిన మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు
కనిగిరి డిసెంబర్ 3 (న్యూస్ మేట్) : 03/12/20కనిగిరి నగర పంచాయతీల్లోని ఎన్జీవో కాలనీ శివ నగర్ కాలనీ లో పర్యటించిన మునిసిపల్ కమిషనర్ నారాయణ రావు కాలనీలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి మున్సిపల్ కార్మికులకు మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ కు పలు సూచనలు చేశారు నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ కి ఆదేశించారు.కాలనీలలో మురుగు కాలవలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి చెత్త నిలువ ఉండకుండా చూడాలని చెత్త నిల్వ ఉండడం వల్ల దోమలు మరియు పందులు తిరిగి రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన రోడ్లకు అప్రోచ్ ఏర్పాటు చేయాలని సెక్రెటరీని ఆదేశించారు.అర్బన్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డ్ లో వర్షం వలన పాడైపోయిన డంపింగ్ పరిసరాలను పరిశీలించి డంపింగ్ వాహనాలు రాకపోకలకు వీలు గా ఏర్పాటు చేశారు . తడి పొడి చెత్త వేరు చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తప్పనిసరిగా అమలు పరచాలని సెక్రటరీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు సెక్రటరీలు పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *