డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే

డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే
టిడ్కోఇళ్ల సాధనలో లో సిపిఐ తొలి విజయం
పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో 3 సెంట్లు నివేశ స్థలం ఇవ్వాలి
భారత్ బంద్ లో కమ్యూనిస్టులు సంపూర్ణ మద్దతు
బంద్ కు మద్దతు తెలపక పోతే వైసిపి టి డి పీ లు చరిత్రహీనులు అవుతారు పంపుసెట్లకు నో మీటర్
ప్రకాశం జిల్లా ‘చలో కలెక్టరేట్ ‘లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఒంగోలు డిసెంబర్ 7 న్యూస్ మేట్ :07/12/20ఈ నెల 25న రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం నివేసిత స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు వంతున పంపిణీ చేయాలన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సీపీఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సీపీఐ ఒంగోలు నగర కార్యదర్శి ఎస్ డి సర్ధార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరై మాట్లాడుతూ మూడు ,నాలుగు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జగన్ క్రిస్మస్ కు ఇళ్ళస్ధలాలు ఇస్తామని ప్రకటించారన్నారు.అయితే బీజేపీ క్రిస్మస్ పండుగ రోజు వద్దని హిందువుల పండుగ రోజు ఇవ్వాలని ప్రకటన చేయటాన్ని వ్యతిరేకించారు. సొంతిల్లు లేని పేదలకు నివేసిత స్ధలాల పట్టాలు వచ్చిన రోజే నిజమైన పండుగ అన్నారు. ఎటువంటి వాయిదాలకు అవకాశం లేకుండా క్రిస్మస్ రోజున స్ధల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. కుటుంబ భవిష్యత్ తరాలను గమనంలో వుంచుకుని,ఇంటిలో భార్య భర్తలతో పాటుగా ,వారి తల్లిదండ్రులు, పిల్లలు వుండేలా ,ఇంటిలో టీవీని పెట్టుకుని సౌకర్యవంతంగా చూసేందుకు వీలుగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వంతున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి స్ధలాలు ఇస్తామంటూ 56 వేల ఎకరాలను సేకరించి రూ.7 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు హయాంలో ఇళ్ళ స్ధలాలు ఇచ్చినా ఇప్పటికీ 30 లక్షల మందికి ఇవ్వాలా!అని ఆయన ప్రశ్నించారు.రాష్ర్టంలో కోటి మందికి పైగా కార్లు, బంగ్లాలున్న వారికి తెల్లరేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తున్నారని ,ఇప్పుడు కూడా అధికార పార్టీ చుట్టూ తిరిగే వారికే ఇళ్ళ స్ధలాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఇళ్ళ స్ధలాల పంపిణీ పారదర్శకంగా జరగాలన్నారు.టిడ్కో గృహాల విషయం లో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంలో కదలిక తెచ్చి ప్రకటన చేయించటం,కొందరికి హక్కు పత్రాలు ఇఫ్పించటం ద్వారా సీపీఐ తొలి విజయం సాధించిందన్నారు.పేదవారికి సొంతింటి కల నెరవేరాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర నిధులతో,లబ్దిదారుల వాటాలతో కలిపి టిడ్కో గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు.అయితే ప్రభుత్వం పూర్తయిన గృహాల ను లబ్దిదారులకు ఇవ్వకుండా కరోనా పేషెంట్లను ఉంచటం దుర్మార్గమన్నారు.సగం నిర్మాణాలు పూర్తయిన గృహాల గురించి పట్టించుకోలేదన్నారు.సీపీఐ నవంబర్ 14 లోపు గృహాల ను లబ్దిదారులకు అందించకపోతే గృహ ప్రవేశాలు చేస్తామని డెడ్ లైన్ ఇవ్వటంతో 18 నెలలపాటు స్పందించని ప్రభుత్వం ఆఘమేఘాల మీద స్పందించిందన్నారు.టిడ్కో గృహ సముదాయాలకు తాగునీటి పైపులు వేయాలని ,డ్రైన్ లు నిర్మించాలని ,రోడ్లు వేయాలని ,లాటరీ పద్దతి ద్వారా ఎంపికై డబ్బు కట్టిన లబ్ధిదారులకు వెంటనే గృహాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పాటికే రూ. 5 వేల నుండి లక్ష వరకూ డిపాజిట్ చేసిన లబ్ధిదారులు గృహాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.జగన్ పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం టిడ్కో గృహాల లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 న తలపెట్టిన భారత్ బంద్ రాష్ట్రంలో ని వైసిపి, టీడీపీ లు మద్దతు ఇవ్వక పోతే ఆ రెండు పార్టీలు చరిత్ర హీనులు గా మిగిలి పోతారన్నారు.ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి వామపక్షాలతో పాటు గా కాంగ్రెస్,డీఎంకే, జెడీఆర్ ,ఆర్ జేడి వంటి 14 రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు.రాష్ట్రంలో ని వైసీపీ, టీడీపీ లు మద్దతు ధర కోసం పోరాడింది మేమంటే మేమని ప్రకటన లు చేస్తున్నారన్నారు. బంద్ కు మద్దతు ఇవ్ళకపోతే రైతు వ్యతిరేకులు గా ,మిగిలి పోతారన్నారు. ఎముకలు కొరికే చలి లో ప్రాణాలను లెక్కచేయకుండా రైతులు సాగిస్తున్న పోరాటానికి ప్రపంచమంతా మద్దతు తెలుపుతుందన్నారు.బంద్ లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంద్ కు మద్దతు తెలపాలంటూ అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డి నేషన్ కమిటీ ఆధ్వర్యంలో రామకృష్ణ కు వినతిపత్రం చుండూరి రంగారావు ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు,సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, పి మాలకొండయ్య వడ్డే హనుమారెడ్డి, అందే నాసరయ్య ,కె వీరారెడ్డి,సింగరకొండ,సయ్యద్ యాసిన్ ,,సామ్యేలు ,నల్లూరి మురళి ,ఆర్ రామకృష్ణ,మేడా వెంకట్రావు,పురిణి గోపి,కృష్ణగౌడ్,షేక్ ఖాసీం,ఉప్పుటూరి ప్రకాశరావు,,నక్కల శ్రీను, మహిళాసమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయ,లక్ష్మీ ప్రసన్న,లక్ష్మీ,గాయత్రీ,ఏఐవైఎప్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పురిణి రవి,ఆనంద్ మోహన్,Aఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి సురేష్ బా బు,బికేఎంయు నాయకులు రామారావు,పి.బాలకోటయ్య,వల్లెపు నరసింహ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆర్ రామకృష్ణ,ముత్తని అంజయ్య,బాలకోటయ్య,తరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *