నేడు భారత్ బంద్

నేడు భారత్ బంద్
కందుకూరు డిసెంబర్ 7 న్యూస్ మేట్ : 07/12/208న జరిగే భారత్ బంద్ ని ప్రజలు జయప్రదం చేయాలని అఖిలపక్ష కమిటీ నాయకులు కోరారు .సోమవారం సిపిఐ కార్యాలయంలో డాక్టర్ మువ్వ కొండయ్య అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది .సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూ ఢిల్లీలో 12 రోజుల నుండి లక్షలాది మంది రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కందుకూర్ లో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బందులో రైతులు కార్మికులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. టిడిపి ఎస్సీ సెల్ నాయకులు మోషే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సిపిఎం నాయకులు గౌస్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ విజయవంతానికి వ్యాపార వర్గాలు ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బూసి సురేష్ బాబు పి బాలకోటయ్య ఆనంద మోహన్ హుస్సేన్ టిడిపి నాయకులు మాదాల మాల్యాద్రి నాగేశ్వరరావు రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ సమితి నాయకులు కాకుమాని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *