జనసేన దీక్షకు బిజెపి మద్దతు

జనసేన దీక్షకు బిజెపి మద్దతు
కావలి, డిసెంబర్ 7,(న్యూస్ మేట్): 07/12/20నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నారని వారు వేసుకున్న పంటలు నీట మునిగిన నేపధ్యంలో ఇటీవల నెల్లూరు పర్యటన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిచాలని, రైతులకు అండగా జనసేన తరుపున నిరాహార దీక్షలకు పిలుపునివ్వడంతో కావలి పట్టణంలో సోమవారం జనసేన నాయకులు అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతిచ్చారు. అనంతరం జిల్లా బిజెపి అధ్యక్షుడు భరత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు కుట్టబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడిందని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్ధితి ఏర్పడిందని అన్నారు. నీట మునిగిన పంటలు చూసైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, రైతులందరికీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని ఎకరాకు తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన చేసి రైతుల సమస్యలు తెలుసుకుని నేడు నిరాహార దీక్షలు చేపట్టడం స్వాగతిస్తూ మద్దతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరియల్ సర్వే చేసి నామమాత్రపు చర్యలు తీసుకుందని అన్నారు. త్వరగతిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో జనసేన,బిజెపి నిరసనలు ఎక్కువవుతాయని తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *