ప్రమాదానికి నెలవుగా మారిన ప్రధాన రహదారి

07/12/20ఉదయగిరి డిసెంబర్ 7 (న్యూస్ మేట్) ఎంతో కాలంగా మరమ్మతులకు నోచుకోక పోవడంతో ఉదయగిరి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకారిగా మారిపోయింది. నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో మంది రాజకీయ నాయకులను అందించింది. కానీ ఉదయగిరి దుస్థితి మాత్రం ఏమాత్రం మార్పు చెందలేదని ఈ రహదారి సాక్ష్యం చెబుతుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ అనంతరం వేసిన తారు రోడ్డే నేటికీ మిగిలి ఉంది. గతుకుల మయంగా మారిపోయి వాహనదారులు జారిపడుతున్న పాదచారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్టు మిన్నకుండి పోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి కారణమవుతోంది. మేజర్ పంచాయతీ గా మండల కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఉదయగిరి ప్రధాన రహదారిని మరమ్మతులు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *