నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి..

07/12/20

ఉదయగిరి డిసెంబరు 7 (న్యూస్ మేట్) ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన మెట్ట ప్రాంత రైతులను ఆదుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు సోమవారం ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ట ప్రాంతపు రైతులు కష్టించి పండించిన పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షం రైతుల పంటలను కబలించిందని, నీట మునిగిన పంటను చూసుకొని నిస్సహాయ స్థితిలో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 13. 326 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన పంటల్లో అధికంగా మినుము, పెసర, వరి, అలసంద, బొప్పాయి, మిరప తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పారదర్శకంగా పూర్తి స్థాయిలో సర్వే జరిపి నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేల రూపాయలు అందించాలన్నారు. తక్షణ సాయం కింద 10 వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అల్లూరి రవీంద్ర, రామ చైతన్య కమతం శ్రీనివాసులు కల్లూరి రవీంద్రారెడ్డి, తిరుపతయ్య పాలశెట్టి శ్రీనివాసులు దుంపలగడ్డ రవీంద్ర, పటాన్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *