సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కావలి డి.ఎస్.పి
ఉదయగిరి డిసెంబర్7 (న్యూస్ మేట్) సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయగిరి సర్కిల్ కార్యాలయాన్ని కావలి డి. ఎస్. పి. దేవరకొండ ప్రసాద్ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండాలని ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఫ్రెండ్లీ పోలీస్అమలు చేస్తూ ఫిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు ఉదయగిరి సర్కిల్ పరిధిలోని శాంతిభద్రతలపై ఆయన అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు, ఇలాగే పారదర్శకంగా విధులు నిర్వహించి డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని అలాగే ఇబ్బందికర అంశాలు ఉంటే చర్యలు తీసుకోక తప్పదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సి. ఐ ప్రభాకర్ రావుతో పాటు ఉదయగిరి ఎస్. ఐ మరిడి నాయుడు, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, ఎస్సైలు పాల్గొన్నారు.