ఉదయగిరి డిసెంబర్ 7(న్యూస్ మేట్ ) ఉదయగిరి నుంచి బనగానపల్లె కి వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ కు స్థలం అప్పగించి త్వరిత గతిన రోడ్డు పూర్తయ్యేందుకు సహకరించాలి అంటూ వైయస్సార్ సిపి మాజీ మండల కన్వీనర్, మూలే. సుబ్బారెడ్డి సోమవారం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అటవీశాఖ అడ్డంకుల వల్ల ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం ఆగిపోయిందని ఇప్పటికీ అధికారులు స్పందించి అటవీ శాఖకు ఇవ్వవలసిన స్థలం రెవిన్యూ శాఖ ద్వారా ధ్రువీకరించడం జరిగిందని స్థలం త్వరితగతినస్థలం అటవీ శాఖకు అప్పగిస్తే రోడ్డు నిర్మాణం ప్రారంభం అవుతుందని సుమారు 15 గ్రామాలకు రాకపోకలు దగ్గరపడ్డాయని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల మట్టి రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు మరింత ఇబ్బందికరంగా ఉందని ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని భూ అప్పగింత త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.