పోతురాజు కాలువను ఒంగోలు ట్యాంకు బండ్ గా చూడలేమా?. డాక్టర్ చాపల వంశీకృష్ణ
ఒంగోలు డిసెంబర్ 7 న్యూస్ మేట్ : ఆధునిక ఒంగోలు భవిష్యత్తు, అభివృద్ధి అంతా పోతురాజు కాలువ అభివృద్ధి మీదనే ఆధార పడి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అని ప్రముఖ వైద్యులు చాపల వంశీకృష్ణ అన్నారు.నివర్ తుఫాన్ వర్షాలకి ఒంగోలు నగరంలో చాలా చోట్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోయాయాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లు అయిన కర్నూల్ రోడ్డు, బస్టాండ్ సెంటర్ జలమయం అయ్యాయి. దీనికి ప్రధాన కారణం డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడం. అని ఆయన తెలిపారు .పోతురాజు కాలువను ఆధునికీకరిస్తే ఈ సమస్యను సునాయాసంగా అధికమించవచ్చన్నారు.అలాగే మురుగు నీటితో నిండి పోయిన పోతురాజు కాలువ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుచున్నాయి. అన్ని కాలాలలోనూ, ముఖ్యంగా శీతాకాలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ కాలువ చుట్టూ ఉండేది పేద ప్రజలు. గత రెండు మూడు సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్య కారణాల వల్ల ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడ్డారని ఆయన వెల్లడించారు.ఒంగోలు నగరం సుందరంగా మారడానికి, ఆర్ధిక పరిపుష్టినివ్వడానికి పోతురాజు కాలువ ఒక గొప్ప అవకాశం. కాలువ రెండు వైపులా రోడ్లు వేసి, షాపింగ్ మాల్స్, అమ్యూజ్ మెంట్ కేంద్రాలు, పార్కులు ఏర్పాటు చెయ్యగలిగితే ఇది మన ఒంగోలు ట్యాంక్ బండ్ లా తయారవుతుంది. దీనితో పాటు కాలువలో స్పీడ్ బోటులు అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందని వంశీకృష్ణ తెలిపారు.పోతురాజు కాలువను అభివృద్ధి చేస్తే, నగరం కూడా అటువైపు వేగంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అపుడు ఊరికి ఒక చివర ఉన్న కాలువ కాస్తా ఊరి మధ్యలోకి వచ్చి అందరికి ఆహ్లాదాన్ని పంచుతుంది.అనేక దీర్ఘ కాలిక ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి పోతురాజు కాలువను అభివృద్ధి చేసి మన ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా తయారు చెయ్యాలని ఆయన కోరుతున్నారు.