స్వచ్ఛంద సంస్థల సేవలు విస్తృతం కావాలి
అడిషనల్ యస్ పి.వెంకటరత్నం
అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుక
కావలి డిసెంబర్ 7,(న్యూస్ మేట్): స్వచ్ఛంద సంస్థల సేవలు ఈ సమాజానికి విస్తృతం కావాలని అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం కోరారు. కోవూరులోని కె వి ఎస్ కళ్యాణ మండపము నందు విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వారి ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయిలో నిష్ణాతులైన వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి వెంకటరత్నం జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు అందించారు. ప్రభుత్వం తో పాటు ప్రజా సంక్షేమం కు సేవా సంస్థ ల సేవలు అవసరమని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు తాళ్లూరి సువర్ణ కుమారి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలలో, వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని గుర్తించి తమ ట్రస్టు ద్వారా సేవా పురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తమ విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, కర్నాటక రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు, సంస్థల కు పురస్కారాలు అంద చేశారు. సామాన్య గృహిణి అయిన సువర్ణ పరంపర ఆయుర్వేద వైద్యులు గా ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారని, అలాగే కరోనా లో వివిధ వర్గాలకు చెందిన వారికి వైద్య సేవలతో పాటు, ఆహార వసతి కల్పించారని సీనియర్ పాత్రికేయులు జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే క్రమంలో సమాజానికి సేవలు అందిస్తున్న వారిని భారీ స్థాయిలో సత్కరించిన ఘనత సువర్ణకే దక్కిందని అన్నా రు. సంస్థ పేరు విశ్వంభర ను సార్థకం చేస్తూ 150 మందిని సత్కరించడం సేవారంగ చరిత్ర లో విశేష మని ప్రతాప్ రెడ్డి ప్రశంసించారు. తల్లి తండ్రుల ఆశయానికి అండగా సువర్ణ కుమారుడు అనూప్, కుమార్తె వెన్నెల లు చిన్న వయసు లో ఇచ్చిన సహకారం అభినందనీయమని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. పదిమంది పచ్చగా ఉండాలన్న ఆకాంక్షతో సేవలందిస్తున్న వారి ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే ఆశయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ కన్వీనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త బీఎంకే రెడ్డి , విశ్రాంత జడ్జి సంజీవయ్య, మనస్వి ట్రస్ట్ నిర్వాహకులు సదాశివరావు , కావలి శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి మాధవి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.