.నీలి నాలుక వ్యాధి తో పెను ప్రమాదం.
వర్షాకాలంలో దోమల బెడద తో వ్యాప్తి.
జాగ్రత్తలతో వ్యాధి నియంత్రణ
వలేటివారిపాలెం డిసెంబర్ 7 న్యూస్ మేట్. జీవాలకు నీలి నాలుక వ్యాధి ( బ్లూ టంగ్ ) సోకితే నష్టం ఎక్కువగా ఉంటుందని ఈ వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఏడి కేవి బ్రహ్మయ్య సూచిస్తున్నారు. తొలకరి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ తరువాత విస్తారంగా వర్షాలు పడితే దోమల బెడద అధికంగా ఉంటుంది. దోమకాటు వల్ల వ్యాపించే ఈ వ్యాధి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దోమకాటు వల్ల వ్యాధి వ్యాప్తి.
దోమకాటు వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నివారణకు సాయంత్రం 5 గంటల నుండి జీవాలు మంద ఉన్నా ప్రాంతంలో వేపాకు లేదా యూకలిష్టన్ ఆకు, కలబంద ఆకు పిడకలను కాల్చి దోమలను నివారించాలి. మంద ను ఎత్తైన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. టెక్కిల్, డెల్టా
మిధిన్,సైపర్ మిథిన్,అమిత్ రాజ్ వంటి మందులు మంద ఉన్న ప్రాంతాలలో జాగ్రత్తగా పిచికారి చేసుకోవాలి. మాంసం,పాల ద్వారా ఈ వ్యాధి ఒకదాని నుంచి ఇంకో దానికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తు జీవాలను కోయరాదు. పాలను గొర్రె పిల్లలు త్రాగకుండా చూడాలి. నీలి నాలుక వ్యాధి నివారణకు హోమియో మందు మిల్క్ పాల్ ఒక మిల్లీ లీటర్ చొప్పున మూడు రోజులు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
వ్యాధి లక్షణాలు.
ఈ వ్యాధి సోకిన గొర్రెలకు మేకలకు ఎక్కువగా జ్వరం ఉంటుంది. మూతి పెదవులు చిగుర్లు నాలుక ముఖం వాపు వచ్చి పుండ్లు ఏర్పడతాయి. నోటి నుంచి నురగతో కూడిన సొంగ కారతుంది. కళ్ళు ముక్కులు వాపు వస్తాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగులో మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. గిట్టల పై భాగం ఎర్రగా కందిపోయి చీము పట్టి నడవలేక కుంటుతుంటాయి. మేత తినకపోవడం వలన జీవాలు నీరసించి బరువు కోల్పోతాయి. దీనివల్ల మరణాలు సంభవిస్తాయి.
చికిత్స విధానం మిలా…!
వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి చికిత్స వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యాధిసోకిన జీవాలని మంద నుంచి విడిగా ఉంచి చికిత్స అందించడం ద్వారా ఇతర జీవాలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలకు పశువైద్యాధికారి సూచన మేరకు ఇతర బ్యాక్టీరియా ల వలన కలిగే దుష్ఫలితాల నివారణ కు రక్షా-బ్లూ యాంటీబయోటిక్ ఎన్రోప్లాక్సిన్ లాంటి ఇంజెక్షన్లు 3-5 రోజులు వాడాలి. నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరో గ్లిజరిన్ పూయాలి. గొర్రెల నాలుక వాపు ఉండటం వలన మేత మేయవు. కాబట్టి రాగి గెంజి ఇచ్చి మరణాల బారిన పడకుండా నివారించవచ్చు. గిట్టల పై ఎర్రగా కంది వాపు ఉండటం వలన నడవ లేవు కాబట్టి వ్యాధిసోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి ఇంటివద్దనే ఉంచాలి. నొప్పి తగ్గెందుకు పశు వైద్యుడి సూచన మేరకు నొప్పి తగ్గించే ఇంజెక్షన్లను ఇప్పించాలి