గండిపాలెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

గండిపాలెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
వరికుంటపాడు డిసెంబర్ 8 న్యూస్ మేట్ : 08/12/20భారీ వర్షాల కారణంగా చేరిన వరదనీటితో గండిపాలెం జలాశయం పూర్తిగా నిండుతున్నందున, ఈరోజు అనగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వరికుంటపాడు తాసిల్దార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు . కావున పిల్లాపేరు వాగు పరివాహక ప్రాంతంలోని తూర్పు బోయమడుగుల, తూర్పు చెన్నంపల్లి, అలివేలు మంగాపురం, జడదేవి మరియు నల్లబోతులవారి పాలెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు . సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. అన్ని శాఖల ఉద్యోగులు మరియు గ్రామ సెక్రటేరియట్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ వారి వారి హెడ్క్వార్టర్స్ లోనే బస చేయాలి. పశువులు, గొర్రెలు, మేకలు తదితర జంతువులు లేదా మనుషులు, పిల్లలు తదితరులు పిళ్ళాపేరు లోనికి వెళ్ళకుండా హెచ్చరికలు చేయాలి. వాగులలో, వంకలలో, గుంతలలో, చెరువులలో ఈత కొట్టడం పూర్తిగా నిషేధించడమైనది. గ్రామ రెవిన్యూ సహాయకులు తగు జాగ్రత్తలు వహించాలని తహశీల్దారు తెలిపారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామంలోని గ్రామ పెద్దలు, యువకులతో రక్షణ బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తహసిల్దార్ కి తెలియజేస్తూ తగు సూచనలు పొందాలి. ఇందుకు ఎవరు తప్పరాదు. అత్యంత జాగరూకతతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం అని ఆయన అన్నారు.

 

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *