రైతులకు మద్దతు గా పొదిలి లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ! – – బంద్ సంపూర్ణం

రైతులకు మద్దతు గా పొదిలి లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ! – – బంద్ సంపూర్ణం
పొదిలి డిశంబరు 8 న్యూస్ మేట్ : 08/12/20గత 13 రోజులుగా ఢిల్లీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా” భారత్ బంద్ ” కార్యక్రమంలో భాగంగాపొదిలి లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ,ఏఐటియుసి, యు టి ఎఫ్, సి ఐ టి యు, ఆధ్వర్యంలో పొదిలి విశ్వనాధ పురం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి స్థానిక చిన్న బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున వ్యవసాయ ట్రాక్టర్లు, రైతులు, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా దేశ ప్రధాని మోడీ అమిషా జోడిచేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతన్నలు కదం తొక్కి ఢిల్లీ పీఠాన్ని కూలదోసి తారని , రైతాంగ ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం సిపిఎం ఏరియా కార్యదర్శి కె రమేష్ మాట్లాడుతూఒక కోటి 26 లక్షల మంది మంది రైతులు, లక్ష ట్రాక్టర్లతో దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఉద్యమిస్తుంటే దేశ ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదని, ఈ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ శక్తులకు దాసోహ ప్రభుత్వం అని వారు ఎద్దేవా చేశారు.యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ , ఉద్యోగ, కార్మిక సంఘాల హక్కులనుకాలరాస్తున్నాయని చివరికి అన్నం పెట్టే రైతన్నను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రానున్న రోజుల్లో ఉద్యోగులు కార్మికులు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు,

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *