ఉదయగిరి డిసెంబరు 8( న్యూస్ మేట్ ) : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా ఉదయగిరిలో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు పలికాయి. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు ఉదయగిరిలో వర్షంలో తడుస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు కాకు. వెంకయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకూరు రమేష్ నాయుడు తో పాటు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నాయి.