హోసింగ్ బోర్డు అడ్డరోడ్డు రెండు వైపుల కాల్వలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

హోసింగ్ బోర్డు అడ్డరోడ్డు రెండు వైపుల కాల్వలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి
ఒంగోలు డిశంబరు 8 న్యూస్ మేట్ : 08/12/20ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధానమైన హౌసింగ్ బోర్డు కాలనీ గత 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయింది . అయితే పది సంవత్సరాలు నుంచి కొంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి . 120 అడుగులు మెయిన్ రోడ్డు కూడ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అలాగే అడ్డరోడ్డు కూడ చాల చోట్ల రోడ్డు లు రెండు వైపుల కాల్వలు కూడ పూర్తి స్థాయిలో జరగలేదు . నిత్యం మంత్రులు , పార్లమెంట్ సభ్యుడు , ఉన్నతాధికారులు ,అధికారులు , విద్యార్థులు లతో ఎప్పుడు బిజీగా ఉంటుంది . అయినా ఎవరు ఈ వైపు చూడడం లేదు అని ఒంగోలు సిటిజన్ ఫోరమ్ అద్యక్షుడు కొల్లా మధు ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్ బోర్డు 19 వ వార్డు ప్రాంతంలో బొమ్మరిల్లు బాలల లోగిలి వసతి గృహం ఉంది షూమారు 50 మంది పేద విద్యార్థులు ఉంటారు .ఒక పేద విద్యార్థుల సంస్థ నడుపుతున్నారు .ఆదర్శ దంపతులు 50 మందికి తల్లి తండ్రులు గా ఉంటూ చూస్తున్నారు . అలాగే ఆ ఏరియాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడ ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. ఆ లైన్ లో పూర్తి స్థాయిలో రోడ్డు లేదు డ్రైనేజ్ కూడ లేకపోవడంతో వర్షం వస్తే చాలు రోడ్డు పూర్తిగా వర్షం నీళ్ళతో మునిగి పోతుంది. పేద విద్యార్థులు , బ్యాంకు కు వచ్చే వాళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు.విద్యార్థులు ప్రధానంగా కరోనా , దోమలు , మురికి నీళ్ళల్లో నివాసం ఉంటున్న పరిస్థిది . ఆ లైన్లో నివాసం ఉంటున్న వారికి అంటువ్యాధులు ప్రబలుతాయని భయపడుతున్నారు . నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఆ లైన్ లో విద్యార్థులు మురికి నీళ్ళలో నడవడం లేకుండ రోడ్డు , డ్రైనేజ్ , డిజిటల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని మధు కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *