వృద్దులను నమ్మించి నగదు అపహరించిన వాలంటీర్

వృద్దులను నమ్మించి నగదు అపహరించిన వాలంటీర్
కందుకూరు డిసెంబర్8 న్యూస్ మేట్ : 08/12/2008/12/2008/12/20రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టేందుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే పాలన అంటూ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి సరికొత్త అధ్యాయం కు నాంది పలికారు. అయితే అది సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు మాత్రం విఫలమవుతున్నారనడంలో సందేహంలేదు. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పట్టణంలోని తూర్పు వడ్డెపాలెం 7వ సచివాలయంలో పని చేస్తున్న ఓ వాలంటీర్ తన మోస బుద్దిని బయటపెట్టాడు. అతని 50 ఇళ్ళ పరిధిలోని ఇద్దరు వృద్దులను నమ్మకంగా నమ్మించి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పించనులో మీ వేలి ముద్రలు, పడలేదనో భీమా కోసం వేలి ముద్రలు కావాలని రకరకాలుగా కారణాలు చెప్పి వారి చేత వేలి ముద్రలు వేయించి బయోమెట్రిక్‌ యంత్రాల ద్వారా వారిద్దరి వ్యక్తిగత ఖాతా నుండి 65 వేలు నగదును చాకచక్యంగా అపహరించాడు.గత పది రోజుల క్రితం వీరిద్దరి నుండి పలు కారణాలు చెప్పి వెలి ముద్రలు వేయించుకొని నగదును అపహరించాడు. అయితే రెండు రోజుల క్రితం బ్యాంకు ఖాతాలోని డబ్బులు పోయాయని తెలుసుకున్న బాధితులు సచివాలయం వద్దకు వచ్చి లబోదిబోమన్నారు. కొంత మంది భాధితులు అయితే వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్ళి గొడవకు దిగారు. అయితే వాలంటరీ అతని తండ్రికి బాగోలేదని సచివాలయంలో సెలవు పెట్టి వెళ్ళాడని సచివాలయ అధికారి చెప్పారు. వెంటనే వాలంటరీ కి ఫోన్ చేయగా ఫోన్ పనిచేయకపోవడంతో అతని చేతిలో మోసపోయామని నిర్ధారించుకొని చేసేది లేక భాదితులు కందుకూరు మున్సిపల్ కమీషనర్ మనోహర్ కు ఫిర్యాదు చేసారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వాలంటరీ ని సస్పెడ్ చేసి విచారణ జరిపి మోసపోయిన భాదితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

బాధితురాలు :-1) కుంచాల సుబ్బమ్మ :-అయ్యా మా వాలంటరీ నాచేత రేషన్ కార్డు కోసమని , భీమా పధకం అని ఏవేవో చెప్పి వేలిముద్రలు వేయించుకున్నాడు. నేను ఈనెలలో వచ్చిన ఫించను నా బ్యాంకు ఖాతాలో వేసుకుందామని బ్యాంక్ కు వెళితే నా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగితే అసలు విషయం తెలిసిందన్నారు. అయ్యా మీరే నా డబ్బునాకు ఇప్పించాలని ఆమె వాపోయారు.

బాధితురాలు 2) కుంచాల వెంకట రత్నం :-  నీకు భీమా పధకం కి సరిగా వేలిముద్రలు పడలేదని చెప్పి నా చేత అనేకసార్లు వేలిముద్రలు వేింయిచుకొని నా అకౌంట్ నుండి రూ 45000/- లు తీసుకున్నాడు. విషయం తెలుసుకొని సచివాలయం వద్ద కు వెళ్లి అధికారులకు చెప్పాను. వాళ్ళు విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా సమాధానం లేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్ త్వరగా వాలంటరీ దగ్గర నేను మోసపోయిన డబ్బులను తిరిగి యిప్పించాలని కోరుకుంటున్నాను.

మున్సిపల్ మేనేజర్ వివరణ:-మా వద్దకు వాలంటరీ చేతిలో మోసపోయామని ఇద్దరు వృధ్ధ మహిళ లు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే వాలంటరీ ని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈ తప్పిదం ఎలా జరిగిందో చర్యలు చేపట్టి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి మోసపోయిన వారికి న్యాయం చేస్తాము. విచారణ లో వాలంటరీ తప్పు చేశాడని నిర్ధారణ అయితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నాము.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *