నలుగురు పేకాట రాయుళ్లు అరెస్టు.
వలేటివారిపాలెం డిసెంబర్ 8 న్యూస్ మేట్ : మండలంలో నలుగురు పేకాట రాయుళ్ళను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై చావా హజరతయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కూనిపాలెం వెంగమాంబ రైస్ మిల్ పక్కన కందుకూరు కోటారెడ్డి నగర్ కు చెందిన దగ్గుపాటి మాధవ మరియు ముగ్గురు కలిసి పేకాట ఆడుతుండగా ఎస్సై చావా హజరత్తయ్య తన సిబ్బందితో కలసి రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 79,463 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై చావా హజరత్తయ్య, సిబ్బంది శ్రీను, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.