ఢిల్లీ రైతులకు మద్దతుగా ఒంగోలులో బంద్ నిర్వహించిన టిడిపి

ఢిల్లీ రైతులకు మద్దతుగా ఒంగోలులో బంద్ నిర్వహించిన టిడిపి
ఒంగోలు డిసెంబర్ 8 న్యూస్ మేట్ : 08/12/20కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీసే ఏ చట్టాలు నైనా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవన్ వద్ద నూకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నుకసాని బాలాజీ మాట్లాడుతూ దుర్మార్గమైనటువంటి రైతుల పొట్టకొట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నామని, కనీస మద్దతు ధర ప్రకటించాలని, అటువంటి తరుణంలో దానిని ప్రకటించకుండా, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా చట్టాలు ఉన్నాయని, రాజ్యసభలో ఈ బిల్లులకు సవరణలను తెలుగుదేశం పార్టీ సూచించినదని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతుల పక్షం మాత్రమేనని, నాడు రాజ్యసభలో రైతు బిల్లుకి మద్దతు ఇచ్చిన పార్టీలు నేడు జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నాయని, లోపల ఒక రకంగా బయటకు మరో రకంగా చేయడం తెలుగుదేశం పార్టీకి చేతకాదని ఆయన అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని అని ఆయన ప్రశ్నించారు. కనీస మద్దతు ధర ప్రకటించకుండా రైతులు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని అన్నప్పుడు, మార్కెట్ యార్డ్ లో ఎటువంటి అమ్మకాలు లేనప్పుడు, మొదట రైతులకు ఎక్కువ ధర చెల్లించి, మార్కెట్ యార్డ్ లో అమ్మకాలు లేనటువంటి సమయంలో రైతులు తక్కువ లభించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులు నిర్ణయించిన ధరలకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారని, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీకి చట్టబద్ధత కల్పించి సంబంధిత బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్ కి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులకు, రైతు సంఘాలలో ఉన్న పెద్దలకు ఉన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చిన్న సన్నకారు రైతుల పంటల కొనుగోలుకు, రక్షణకు సంబంధించి బిల్లులో ఉన్న నిబంధనలు స్పష్టంగా లేవని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికి పంట నష్టపరిహారం, మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండా దాన్ని ఆమోదించారని, దీన్ని మరుగుపరచడానికి సవరణలు ప్రతిపాదించిన తెలుగు దేశం పై వైసీపీ నిందలు వేయడం సరికాదని, వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి తమ విధి విధానాలతో బహిరంగ ప్రకటన చేయాలని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధానాలు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ పమిడి రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రైతుల పక్షపాతి పార్టీదేనని ఆయన అన్నారు. రాజ్య సభ లోపల ఒకలా, బయట మరోలా దొంగనాటకాలు ఆడే పార్టీలు ఉన్నాయని, అటువంటి పార్టీల వల్లే రైతులు నష్టపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆరుగాలం ఎండనక వాననక శ్రమించు రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కనీస మద్దతు ధర కాకుండా చట్టబద్ధమైన హక్కు గా ఉన్నప్పుడే రైతుల ప్రయోజనాలు భద్రత కలుగుతుందని, మార్కెట్ యార్డ్ లు కొనసాగించి, వాటిని పటిష్ట పరిస్తేనే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాస రావు, గుర్రాల రాజ్ విమల్, ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ, ఒంగోలు నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు పసుపులేటి సునీత, విలేజ్ ఖాదీ బోర్డ్ మాజీ డైరెక్టర్ దాసరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగు మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, టి. అనంతమ్మ, ఒంగోలు నగర ఎస్సి సెల్ అధ్యక్షులు నావూరి కుమార్, ప్రధాన కార్యదర్శి కసుకుర్తి అంకరాజు, షేక్ కాలేషా బేగ్, శశికాంత్ భూషణ్, తెలుగు మహిళా నాయకులు టి. ఉమామహేశ్వరి, షేక్ అజిమున్నిస్సా, నల్లూరి నాగేశ్వరమ్మ, తెదేపా నాయకులు పాతూరి పుల్లయ్య, పెల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, చుండి శ్యాం, జి ఎస్ ఆర్ , భాష్యం శీను, చల్లా హరి, నారాయణ, బండారు మదన్, పీ.వెంకటేశ్వర్ రెడ్డి, మన్నేపల్లి హరికృష్ణ, ఉండవల్లి రాము, పి.రాజేశ్, , పూసపాటి జాలి రెడ్డి, పవన్ , కె.సెల్వం, కే శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *