కనిగిరిలో బందు సంపూర్ణం

కనిగిరిలో బందు సంపూర్ణం
కనిగిరి డిసెంబర్ 8 (న్యూస్ మేట్) : 08/12/20వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నగరంలో రైతన్నలు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళవారం కనిగిరిలో భారత్ బంద్ నిర్వహించారు. తొలుత కనిగిరి గార్ల పేట బస్టాండ్ లోని దర్శి చెంచయ్య భవన్ నుంచి రైతులు , కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చర్చి సెంటర్ మీదుగా ఒంగోలు బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రవీంద్ర బాబు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు తమ భూమిలోనే కూలీలు గా మారే ప్రమాదం ఉందని అన్నారు . ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో లక్షల మంది రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారని అన్నారు .ముగ్గురు ప్రాణాలు కోల్పోయినా రైతులు ఎక్కడ చలించక తమ పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ చతికల పడకుండా నిలబెట్టిన వ్యవసాయ రంగాన్ని రైతన్నలను కార్పొరేట్ శక్తుల వద్ద మోకరి ల్లే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయన్నారు. కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు సిపిఐ ఉధ్యమిస్తుందని అన్నారు.రాష్ట్రంలోని వైసిపి ,టిడిపి లు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని లేనిపక్షంలో టీడీపీ వైసీపీలు రైతు ద్రోహులుగా చరిత్రహీనులుగా చరిత్రలో నిలిచిపోతారు.పార్లమెంట్లో 3 వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపిన వైసిపి టిడిపి లు నేడు మద్దతు ధర రాబట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి ఆర్టీసీ డిపో వద్ద రైతు సంఘం నాయకులు ఏఐటియుసి కార్మికులు నాయకులు కలిసి మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సులు నిలువరించారు. మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కనిగిరి మండల కార్యదర్శి జి .పి .రామారావు , రైతు సంఘం నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఏఐటీయూసీ కార్యదర్శి షేక్ మహబూబ్ పీ రా మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం ,రాష్ట్రం బాగుంటుందని మోడీ ప్రభుత్వం రైతులను కూలీలు గా మార్చే వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను సత్వరమే అన్ని రకాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హితవుపలికారు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన వైసిపి ,టిడిపి రైతుల సానుభూతి కోసం మొసలి కన్నీళ్లు కార్చడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సయ్యద్ జిలాని, స్టాలిన్ భాష, ఏఐటీయూసీ కనిగిరి నగర సమితి అధ్యక్ష కార్యదర్శులు షేక్ నాజర్, మల్లారపు వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీను రమణయ్య ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రత్తయ్య శేఖర్, కిరణ్ , మస్తాన్ వలి, సిపిఐ మండల నాయకులు షరీఫ్,లడ్డూ మునయ్య, రబ్బాని ,సాదిక్, ఖాదర్ మస్తాన్, వాటర్ వెంకటేశ్వర్లు, ఖాసిం వలి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *