రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి.

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి.

వలేటివారిపాలెం డిసెంబర్ 8 న్యూస్ మేట్.  : 08/12/20కేంద్రం లోని మోడీ ప్రభుత్వ రైతువ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ వలేటివారిపాలెం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జయప్రదంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాదాల రమణయ్య మాట్లాడారు.గత12 రోజులుగా తీవ్రమైన చలిలో రైతులు పోరాటం చేస్తుంటే మోడీ ప్రభుత్వానికి రైతులపై కనీసం జాలి కూడా లేకపోవటాన్ని విమర్శించారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించాలని,రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేనియెడల ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దువ్వూరి జాన్, కెవిపిఎస్ జిల్లా నాయకులు గుండ్లతోటి మాధవ మూర్తి,సి ఐ టి యు జిల్లా నాయకులు సాదు చెన్నకేశవులు, సిఐటియు మండల కార్యదర్శి పర్రె. భాస్కర్ రావు,రైతులు ఓలేటి నరసింహం, పరిటాల భాస్కర్, మానికొండ కొండయ్య, కొంకా. మాల్యాద్రి, మామిళ్ళపల్లి మాధవరావు,నెలకూరి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *