వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం

వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం

దుత్తలూరు డిసెంబర్ 08 న్యూస్ మేట్:- కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుజ్జుల మలికార్జునా అన్నారు. ఢిల్లీ లో రైతులు చేస్తున్నా పోరాటానికి సంఘీభావంగ దుత్తలూరు జాతీయ రహదారి పై

08/12/20

బంద్ నిర్వహించారు.కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. సిపిఎం పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది అని అన్నారు. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు వారు నష్ట పోయే విధంగా చట్టలు చేశారు ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు.ఈ ధర్నా లో వ్యవసాయ రైతు సంఘం నాయకులు పచ్చవ వెంకటేశ్వర్లు, సీఐటీయూ మండల అధ్యక్షుడు సింహాద్రి మరియి రైతులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *