ఉదయగిరిలో సచివాలయాలు తనిఖీ చేసిన ఆర్ డి ఓ

ఉదయగిరిలో సచివాలయాలు తనిఖీ చేసిన ఆర్ డి ఓ
ఉదయగిరి డిసెంబర్ 9 (న్యూస్ మేట్) : 09/12/20నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి లో ఉన్న మూడు సచివాలయాల ను ఆత్మకూరు ఆర్డిఓ సువర్ణమ్మ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల లో రేషన్ కార్డుల జాబితా తప్పనిసరిగా ఉండాలని రేషన్ తీసుకోవడం మాత్రం లబ్ధిదారులు తమకు ఇష్టమైన చోట భారతదేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చునని ఆమె అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజాభిమానాన్ని పొందుతూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని ఆమె సూచించారు. సచివాలయ సిబ్బంది ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే కచ్చితంగా నివాసం ఉండాలని ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా ఫిర్యాదులు వచ్చినా తగు చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం గంగి రెడ్డి పల్లి లో ప్రభుత్వం వేసిన పేదల లే అవుట్ ని పరిశీలించి వర్షాలకు పాడైన రోడ్లు కొట్టుకుపోయిన ప్లాట్లు తిరిగి మరమ్మతులు చేయాలని ఆమె సూచించారు. ఈమె వెంట తాసిల్దార్ హరనాథ్ తో పాటు సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *