పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ఒంగోలు డిసెంబర్ 9 న్యూస్ మేట్ : పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కు బాపట్ల పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య బుధవారం ఒంగోలులో వినతి పత్రం అందజేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం యంత్రాంగం త్వరితగతిన సమగ్ర సర్వే నిర్వహించి ఆదుకోవాలన్నారు. రాష్ట్రం పరిధిలో రాజకీయాలకు తావులేకుండా నిజమైన ప్రతి అర్హుడైన రైతుకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రాప్ లో లేదనే సాకుతో రైతులకు నష్టం కలిగించవద్దన్నారు. కౌలు రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మళ్లీ రైతాంగం వ్యవసాయం చేసేందుకు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు తక్షణమే అందించేలా చొరవ చూపాలన్నారు.