దెబ్బతిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి
దుత్తలూరు డిసెంబర్ 12 న్యూస్ మేట్ :దుత్తలూరులో తుఫాన్ వల్ల దెబ్బతిన్న మినుము పంటలను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నివర్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు ఉదయగిరి ఏరియా పరిధిలో సుమారు 32 వేల హెక్టార్లలో రైతులు సాగు చేసిన మినుము, పెసర, మిరప, శెనగ మరియు వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు అంచనాలు వేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తండ్రిని మించిన తనయుడిగా పాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు చెన్నారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఏ.యం.సి. చైర్మన్ అలీ అహ్మద్, వైసీపీ మండల కన్వీనర్ వాసుదేవరెడ్డి, మండల వైసీపీ నాయకులు వెంకటేశ్వర్లు, దయాకర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంగళరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.