ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది ..మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది ..మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు
వలేటివారిపాలెం డిసెంబర్ 12 న్యూస్ మేట్ : 12/12/20రాష్ట్రంలో ఆలయాల భూములను అన్యాgక్రాంతం కాకుండా ప్రతిష్ట చర్యలతో పాటు ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు. శనివారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో కలిసి మంత్రి మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం మేళతాళాలతో సహాయ కమిషనర్ కేవీ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. మంత్రి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పరిసరాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. స్వామివారి దర్శనం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందనిఅన్నారు. వారంలో ఒక శనివారం మాత్రమే భక్తులకు దర్శనం ఉండగా కొన్ని వేల మంది కి ఎలాంటి ఆటంకం అసౌకర్యం లేకుండా దర్శనం కలిగేలా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తీసుకున్న చర్యలనుమంత్రి అభినందించారు. లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో రాష్టం సుబిక్షంగా ఉండాలి అని అన్నారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి అన్నదాతలు చెయూత ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుతం 5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పారు .ఈ కార్యక్రమంలో డి సి.చంద్రశేఖర్ రెడ్డి ఒంగోలు ఏ సి గంది మాధవి ఈ ఓ కె బి శ్రీనివాసరావు తహసిల్దార్ ముజఫర్ రహమాన్ సి ఐ మరియు ఎస్సైలు వైసీపీ నాయకులు లక్ష్మీ నరసింహం వెంకటేశ్వర్లు నరేంద్ర రెడ్డి సంజీవరెడ్డి కుంభాల క్రాంతి పొడపాటి నరసింహం వీరాస్వామి సతీష్ అంజయ్య చంద్రమౌళి గోపి పొన్నం వెంకటేశ్వర్లు ఓబుల్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *