రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం..టిడిపి
ఒంగోలు డిశంబరు 12 న్యూస్ మేట్ : దేశానికి వెన్నుముక రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. శనివారం ఒంగోలులోని టిడిపి జిల్లా కార్యాలయంలో తెలుగురైతు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా నూకసాని బాలాజీ మరియు శ్రీనివాస్ రెడ్డి లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం దర్శి నియోజకవర్గ కో ఆర్డినేటర్ పమిడి రమేష్ బాబు, నూకసాని బాలాజీ ని, రాష్ట్ర రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి ని సత్కరించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ, మర్రెడ్డి మాట్లాడుతూ రైతులు పండిస్తున్న పంటలు మరో కొద్ది రోజుల్లో చేతి కందుతాయి అనుకున్న తరుణంలో రైతన్నపై తుఫాన్ కాటేయటంతో అన్నదాత తీవ్రంగా దెబ్బ తిన్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించాల్సిన ప్రజా ప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం దుర్మార్గం అన్నారు. నష్టపోయిన అన్నదాతలకు చేయూత అందించే విషయంలో వైకాపా నాయకులకు పరిహారం అందేలా అధికారులు వత్తాసు పలుకుతూ నివేదికలను తయారు చేస్తున్నారన్నరు. వీటిపై పరిశీలించి పోరాటాలు చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు పార్లమెంటరీ అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బలగాని వెంకటనారాయణ, బాపట్ల తెలుగు రైతు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య, టీడీపీ పామూరు మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, షీప్ సొసైటీ జిల్లా డైరెక్టర్ మోరుబోయిన గంగరాజు యాదవ్, గుంటుపల్లి శ్రీనివాసులు, మానం రామయ్య తదితరులు పాల్గొన్నారు.