టోల్ గేట్ దగ్గర రైతుల ఆందోళన
తర్లుపాడు డిశంబరు12 న్యూస్ మేట్ : ఢిల్లీలో జరుగుతున్న రైతు దీక్షలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పిలుపుమేరకు రాష్ట్రంలోని టోల్గేట్ల ముందు నిరసన దీక్షలు లో భాగంగా ఈరోజు సి.పి.ఐ, సిపిఎం ,రైతు సంఘాల ఆధ్వర్యంలో తర్లుపాడు మండలం మేకవారిపల్లె టోల్ ప్లాజా వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మార్కాపురం నియోజకవర కార్యదర్శి అందే నాసరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా రైతుల నడ్డివిరిచే బిల్లులను ప్రవేశపెట్టిందని ఆరోపించారు, పదిహేను రోజుల నుండి లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు . కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎం, సిఐటియు, నాయకులు, డి.కే.ఎం. రఫీ, సోమయ్య, రూబెన్,,రాజు,సురేష్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.