వైశ్యుల త్యాగాల పై పుస్తకం 

వైశ్యుల త్యాగాల పై పుస్తకం 12/12/20

కావలి డిశంబరు 12 న్యూస్ మేట్ :  కావలి వివిధ రంగాలలో తమ సేవలు అందిస్తూ సమాజానికి దేశానికి విశేష త్యాగాలు చేసిన మహానీయ వైశ్యుల పై గ్రంధాన్ని తీసుకొస్తున్నట్లు జలదంకి మండలం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు  కావలి  కబుర్లు పక్ష పత్రిక సంపాదకుడు ద్రోణాదుల కోటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వేలాది సంవత్సరాల క్రితమే భారతదేశంలో వ్యవసాయాన్ని స్థాపించి  ఆహార ఉత్పత్తిలో అగ్రగణ్యులు గా పేరు పొందారని ఇదే విషయాన్ని వాల్మీకి తన  రామాయణం లో పేర్కొన్నారని కోటయ్య తెలిపారు. అలాగే గో సంపద ను పెంచి గోమాతలు గా పేరుగాంచిన వారే నేటి కోమటోళ్లు అని అన్నారు. భారత మాతకు స్వేచ్ఛ లభింప చేసిన మహాత్మా గాంధీ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం  ప్రాణాలు అర్పించిన   అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్య అని వారి స్ఫూర్తితో ఎంతో మంది సేవా కార్యక్రమాలను దేవా లయం నిర్మాణాలలో కీలక పాత్ర నిర్వహించారని ఈ విశేషాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఆశయాలతో తాను తీసుకు వస్తున్న పుస్తక రచనకు జిల్లాలోని వైశ్యులు ప్రముఖులు వైశ్య సంఘాలు సహకరించాలని ద్రోణాదుల కోటయ్య కోరారు. ఇతర వివరాలకు తన సెల్ నెంబరు  9912181645 సంప్రదించాలని కోటయ్య  కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *