వ్యాధులపట్ల అప్రమత్తం గా ఉండాలి. ఏం పి డి ఓ.

వ్యాధులపట్ల అప్రమత్తం గా ఉండాలి. ఏం పి డి ఓ.
ఉదయగిరి డిశంబర్ 14(న్యూస్ మేట్ ) : ప్రస్తుత వాతావరణ పరిస్థితి లో గ్రామీణ ప్రజలు వ్యాధులపట్ల అప్రమత్తం గా ఉండాలని ఏం పి డి ఓ వీరాస్వామి సూచించారు. సోమవారం మండల పరిధిలోని పుల్లయపల్లి, నెలటూరు సచివాలయం పరిధిలో సిబ్బంది శానిటేషన్ చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలు సుబ్రoగా ఉంచుకోవాలని, పేడ దిబ్బలు ప్రభుత్వం నిర్మించిన వెస్ట్ బిన్ లలో వేసుకోవాలి అని, ఎవరికీ వారు తమ పరిధిలో చెత్త శుభ్రపరుచుకుంటే వ్యాధులు దరికి చేరవని,, పంచాయతీ అధికారులు, ఆరోగ్య సిబ్బంది ఎల్లవేళల గ్రామస్థులకు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న చెత్త వృధాగా పోకుండా సంపద తయారీ కేంద్రానికి తరలించి మీ వ్యవసాయ పొలాలకే ఎరువుగా మళ్ళీ తిరిగి వాడుకునేందుకు ప్రభుత్వం సంపద తయారీ కేంద్రం నిర్మించిందని అందరూ ఉపయోగించుకొని గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్లయ పల్లి, నేలటూరు సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *