భూ రీ సర్వే తో భూ యజమానులకు మేలు చేకూరుతుంది – ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

భూ రీ సర్వే తో భూ యజమానులకు మేలు చేకూరుతుంది – ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

వలేటివారిపాలెం డిసెంబర్ 14 న్యూస్ మేట్ :  14/12/20భూ రీ సర్వే తో ప్రతి భూ యజమానికి మేలు చేకూరగలదని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల కేంద్రమైన తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మీ భూమి మా హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం తహసిల్దార్ ముజఫర్ రెహమాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఇందుకోసం సమగ్ర రీ సర్వే చేయాలని నిర్ణయించిందని అన్నారు. భూమికి రక్షణతో పాటు శాశ్విత భూ హక్కు కల్పించేందుకు ఈనెల 14 నుంచి 19 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలం లో 7 గ్రామాలను భూ రీ సర్వే చేయడానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ జగన్ అన్న శాశ్విత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిజిటల్ సిస్టం ద్వారా 2023 సంవత్సరం నాటికి భూ సర్వే పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రఫిక్ అహ్మద్,ఆర్ఐ ప్రసాద్, ఏవో హేమంత్ భరత్ కుమార్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, ఇంచార్జ్ ఏ పి డి యం. సుభాషిని వైసిపి నాయకులు ఇరపని అంజయ్య,అనుమోలు లక్ష్మీ నరసింహం, వెంకటేశ్వర్లు, పొడపాటి నరసింహం, వరికూటి కొండారెడ్డి, సంజీవరెడ్డి, ఓబుల కొండయ్య, వీరాస్వామి, కట్టా హనుమంతరావు, గోపి, కుంభాల క్రాంతి, కేసింరెడ్డి నరేంద్రరెడ్డి, మర్రి అంజయ్య, బాపతు మాలకొండారెడ్డి, తిరుపతి రెడ్డి, వేణుగోపాల రెడ్డి, గొర్రెపాటి సురేష్,వింజం వెంకటేశ్వర్లు,మన్నం వెంకట రమేష్, అత్తోటి చెన్నయ్య, దాచర్ల రాఘవ, ఇంటూరి హరిబాబు, నల్లమోతు చంద్రమౌళి,బొమ్మినేని నరసింహం, చిన్నబ్బాయి, హరిబాబు, కంచర్ల వేణుగోపాల్, తోకల నరసింగరావు,యానాది తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *