సూర్యనారాయణ మృతి చాలా బాధాకరం -ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

14/12/20

 

సూర్యనారాయణ మృతి చాలా బాధాకరం -ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

వలేటివారిపాలెం డిసెంబర్ 14 న్యూస్ మేట్:  ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఇరపని సూర్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరమని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని చుండి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి చుండి గ్రామానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యనారాయణ మృతి బాధాకరమని అన్నారు. ఆయన నాకు మంచి మిత్రుడని ఆయన మృతి చెందడం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన వెంట వైసిపి నాయకులు ఇరపని అంజయ్య,అనుమోలు లక్ష్మీ నరసింహం, వెంకటేశ్వర్లు, పొడపాటి నరసింహం, వరికూటి కొండారెడ్డి, సంజీవరెడ్డి, ఓబుల కొండయ్య, వీరాస్వామి, కట్టా హనుమంతరావు, గోపి, కుంభాల క్రాంతి, కేసింరెడ్డి నరేంద్రరెడ్డి, మర్రి అంజయ్య, బాపతు మాలకొండారెడ్డి, తిరుపతి రెడ్డి, వేణుగోపాల రెడ్డి, గొర్రెపాటి సురేష్,వింజం వెంకటేశ్వర్లు,మన్నం వెంకట రమేష్, అత్తోటి చెన్నయ్య, దాచర్ల రాఘవ, ఇంటూరి హరిబాబు, నల్లమోతు చంద్రమౌళి,బొమ్మినేని నరసింహం, చిన్నబ్బాయి, హరిబాబు, కంచర్ల వేణుగోపాల్, తోకల నరసింగరావు,యానాది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *