మహిళల భద్రతతో పాటు మహిళా బాలిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం– ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్
కనిగిరిడిసెంబర్ 14 (న్యూస్ మేట్) : కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ సోమవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, న్యాయసేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ సంస్థ సంయుక్తంగా తయారుచేసిన ‘వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లపై మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారని వంద రోజులపాటు కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో మహిళలకు, కిశోర బాలికలకు, కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై అందరి ప్రభుత్వ అధికారులు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం ఏర్పాటు అయిన కమిటీల సహకారంతో మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుందని తెలిపారు. ఐ. సి. డి. ఎస్ సిడిపిఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల మహిళా మార్చ్ దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు . వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని సుజాత మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు మహిళా బాలిక సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున రావు, ఏ ఎస్ డబ్ల్యూ రాజేశ్వరి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, ఎస్. ఐ రామిరెడ్డి, న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్, గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి పారా లీగల్ వాలంటీర్ మండ్రు రమేష్ బాబు, మాజీ ఎంపీపీ దంతులూరు ప్రకాశం, వైసిపి నాయకులు రంగనాయకులు రెడ్డి, కస్తూరి రెడ్డి, మోహన్ రెడ్డి , పులి రాధా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పార్వతి, పద్మజ, అరుణ, కృప వరం, పద్మ, మాధవి , షకీలా రాధా, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గంధం శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.