కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నిర్వీర్య చట్టాలను రద్దు చేయాలి..వామపక్ష పార్టీలు
కనిగిరి డిసెంబర్ 14( న్యూస్ మేట్) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ ని చుట్టముట్టి చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా కనిగిరి లో వామపక్షాలు ,రైతులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమo జరిగింది. సోమవారం గార్ల పేట రోడ్డులోని దర్శి చెంచయ్యభవన్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న మోడీ నిరంకుశ వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో లో స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ను అడ్డుకోవడం జరిగింది .మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలియజేయాలని కోర టం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర మాట్లాడుతూ వైసీపీ రైతు పక్షపాతి ప్రభుత్వమని ,రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే రైతాంగ సమస్యలను తీరుస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న రైతు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు .ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలు న్యాయమైన పోరాటానికి రైతులు వ్యవసాయ కార్మికులు అండగా ఉంటారని తెలిపారు. సిపిఐ మండల కార్యదర్శి జి పి రామారావు ,ఏ ఐ టి యు సి కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి ఎస్ కే ఎం పిరా మాట్లాడుతూ బీజేపీ అధికారానికి వచ్చిన తరువాత మోడీ ఆలోచనా విధానాలు పేద బడుగు బలహీన రైతు కార్మిక వర్గానికి చెంపపెట్టు గా చట్టాలను రూపొందించడం కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అనుసరిస్తుందని అన్నారు .అదేవిధంగా నన్ను నమ్మండి అని ప్రలోభాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ 2014లో దేశంలో లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మబలికిన మోడీ విధానాలు , 2015లో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి మోడీ మాటల్లో నిజం లేదన్నారు. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు జిఎస్టి వంటి వాటిని తీసుకొని వచ్చి మధ్యతరగతి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని వారు అన్నారు. నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతులను రైతు కూలీలను ఇబ్బంది పెట్టే చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కనిగిరి నియోజక వర్గ అధ్యక్షులు వజ్రాల సుబ్బారావు ,ఏఐటియుసి మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్ రావు, మోహన్ ,ప్రసాదు, షరీఫ్ ,వెంకటేశ్వర్లు, రామయ్య ,బలహీన వర్గాల సమాఖ్య నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.