25న పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల పై అధికారులతో సమీక్ష సమావేశం

25న పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల పై అధికారులతో సమీక్ష సమావేశం
కనిగిరి డిసెంబర్ 14 (న్యూస్ మేట్) : 14/12/20రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఈనెల 25వ తారీఖున ఇవ్వనున్న సందర్భంగా తహశీల్దార్,విఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పార్టీ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాల లో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గుర్తించి వారిని కూడా లబ్ధిదారులుగా చేర్చాలన్నారు. 25 వ తేదీన ఇవ్వనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు పండగ లాంటిదన్నారు .ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు. . రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు .ఈ కార్యక్రమంలో కమిషనర్ డివిఎస్ నారాయణరావు. తహశీల్దారు పుల్లారావు. సి ఐ కే శ్రీనివాసరావు . ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *